చెరగని యశస్వి -కళా తపస్వి
Manage episode 354812045 series 2781263
తెలుగు తెరపై కళాత్మక చిత్రాలకు సారథి కె.విశ్వనాథ్. సినీ మాధ్యమం ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని విశ్వవినువీధుల్లో రెపరెపలాడించిన కళాస్రష్ట. తెలుగు కథకు సంగీత, సాహిత్య, నృత్య సొబగుల్ని అద్ది నవ్యపథంలో నడిపించిన దార్శనికుడు. విశ్వనాథ్ సినిమాల గురించి మాట్లాడుకోవడం అంటే మన సంస్కృతి, కళల్ని పునశ్చరణ చేసుకోవడమే. కె.విశ్వనాథ్ సృజించిన చిత్రాలు మన ఘనమైన సంప్రదాయాలు, కళలకు నిలువెత్తు ప్రతిబింబాలుగా విరాజిల్లుతున్నాయి. చక్కటి సామాజిక స్పృహ, మూర్తీభవించిన మానవతా విలువలతో తెలుగు సినిమాకు ఓ ప్రబంధ గౌరవాన్ని తీసుకొచ్చిన దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్. తెలుగు సినీ చరిత్రలో ఆయనది సువర్ణాధ్యాయం. సామాన్యుడు మాన్యుడిగా ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రస్థానం. భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనా కె. విశ్వనాథ్ సముపార్జించుకున్న కీర్తిప్రతిష్టలు ఆచంద్రతారార్కం ప్రభవిస్తూనే ఉంటాయి. ఆయన సినిమాల ద్వారా చాటిన విలువలు రాబోవు తరాల్ని కూడా ప్రభావితం చేస్తాయి
--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/swaramadhuri/message42 episódios